: మూడు వికెట్లు కూల్చిన పాక్... ఆకట్టుకుంటున్న బౌలింగ్
పాకిస్థాన్ బౌలర్లు మూడు వికెట్లు తీసి జట్టులో ఉత్సాహాన్ని నింపారు. 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆసీస్ కు పాక్ బౌలర్లు కళ్లెం వేస్తున్నారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అద్భుతమైన బంతికి ఆరోన్ ఫించ్ (2) ను సొహైల్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా బలిగొన్నాడు. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన డేవిడ్ వార్నర్ (24) ను 9వ ఓవర్ లో చక్కని బంతితో వాహబ్ రియాజ్ పెవిలియన్ బాటపట్టించాడు. అదే స్పూర్తితో 11 ఓవర్ లో కెప్టెన్ మైకేల్ క్లార్క్ (8) ను వాహబ్ రియాజ్ అవుట్ చేశాడు. కాగా, ఆసీస్ 13 ఓవర్లలో మూడు వికెట్లకు 67 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (31 బ్యాటింగ్), షేన్ వాట్సన్ (1 బ్యాటింగ్) ఆడుతున్నారు. పాక్ బౌలర్లలో రియాజ్ రెండు, సొహైల్ ఖాన్ ఒక వికెట్ తీశారు.