: ఆ ఇద్దర్నీ కాల్చిపడేశారు: రాజ్ నాథ్ సింగ్
జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలో రాజ్ భాగ్ పోలీస్ స్టేషన్ పై విరుచుకుపడిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చిపడేశాయని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రదాడి దురదృష్టకరమని అన్నారు. ఉగ్రవాదుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, ఇద్దరు తీవ్రవాదుల్ని పోలీసులు మట్టుబెట్టారు. సుమారు గంటన్నరపాటు జరిగిన పోరాటంలో తీవ్రవాదులు నేలకొరిగారని ఆయన వెల్లడించారు.