: రాజ్ భవన్ లో నేడు ఉగాది వేడుకలు... తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరు!
తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు నేడు రాజ్ భవన్ లో ఘనంగా జరగనున్నాయి. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. గవర్నర్ నేతృత్వంలో జరగనున్న ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులిద్దరూ హాజరుకానున్నారు. వీరితో పాటు రెండు రాష్ట్రాల కేబినెట్ మంత్రులు, పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ వేడుకలకు విచ్చేస్తారు.