: నిజాం వారసుడు కేసీఆర్... బెదిరింపుల్లో ఆయనకు ఆయనే సాటి: బీజేపీ నేత కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బెదిరింపు రాజకీయాల్లో కేసీఆర్, నిరంకుశ పాలకుడు నిజాంకు వారసుడిగా పేరుగాంచారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కళాశాలలను, విద్యావంతులను కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే, రాష్ట్రంలో ఏకచ్ఛత్రాధిపత్యం, నిరంకుశ పాలన పెరిగిపోతుందని ఆరోపించారు. బెదిరింపుల్లో కేసీఆర్ కు నిజాం వారసుడని బిరుదున్నా, తాము భయపడబోమని, ఇదేమీ నిజాం నాటి పాలన కాదని కూడా కిషన్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు.