: రైలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన అఖిలేష్ యాదవ్


ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ జిల్లా బచ్రావా రైల్వే స్టేషన్ సమీపంలో డెహ్రాడూన్-వారణాసి జనతా ఎక్స్ ప్రెస్ రైలు ఈ ఉదయం పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు పరిహారంగా అందజేయనున్నామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు పరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిఉంది.

  • Loading...

More Telugu News