: ధోనీకి పండగే... దేశీయ మార్కెట్ లోకి ఇటాలియన్ సూపర్ బైక్స్ రంగ ప్రవేశం!
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ కప్ ముగించుకుని దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఢిల్లీకి పరుగులు పెడతాడేమో. ఎందుకంటే కన్నులు మిరుమిట్లు గొలిపే ఇటాలియన్ బైక్స్ అతడి లాంటి వినియోగదారుల కోసం అందంగా ముస్తాబై, జెట్ స్సీడుతో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి. 300 సీసీతో మొదలై 1131 సీసీ దాకా వివిధ సామర్థ్యాలతో కూడిన ఈ బైక్ లను ఇటలీకి చెందిన బెనెల్లి తయారు చేసింది. అసలే బైకులంటే అమితాసక్తి కనబరిచే ధోనీ, చూడగానే ఆకట్టుకొనేలా ఉన్న వీటి గురించి తెలిస్తే, ఢిల్లీలో అడుగు పెట్టకుండా ఆగుతాడా? ప్రస్తుతం ఢిల్లీకే పరిమితమై ఈ బైకులను త్వరలో హైదరాబాదీలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు బెనెల్లి బోర్డ్ డైరెక్టర్ జార్జి వాంగ్ తెలిపారు. ఈ బైకులు వాటి సామర్థ్యాన్ని బట్టి రూ.2.83 లక్షల నుంచి రూ.11.81 లక్షల మధ్యలో లభ్యమవుతాయి. వీటిని దేశీయంగానే అసెంబ్లింగ్ చేసేందుకు పూణె సమీపంలో డీఎస్ కే మోటో వీల్స్ రూ.200 కోట్లతో ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేసింది.