: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కం ఫ్రేజర్ కన్నుమూత
గత కొంతకాలంగా స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కం ఫ్రేజర్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున ఆయన మరణించారని ఒక ప్రకటన వెలువడింది. ఆస్ట్రేలియాలో 1975లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు విట్ లామ్ ను ప్రధాని పదవి నుంచి తొలగించిన తరువాత ఫ్రేజర్ బాధ్యతలు స్వీకరించారు. 1983 వరకూ పదవిలో ఉన్న ఆయన, మానవ హక్కుల పరిరక్షణకు మద్దతిచ్చారు. బాధ్యతాయుతమైన ద్రవ్య విధానాన్ని అమలు చేసి, ఖర్చులను తగ్గించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించిన నేతగా ఆయనకు పేరుంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రపంచ నేతలు సంతాపం తెలిపారు.