: పండగవేళ పడిన పసిడి ధర! ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ. 24,620


తెలుగు సంవత్సరాది పండగ ఉగాది శుభవేళ బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర నేడు పడిపోయింది. శుక్రవారం నాటి బులియన్ మార్కెట్ సెషన్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు, రూ. 25,985 (ముంబై), రూ. 26, 270 (చెన్నై) రూ. 26,340 (హైదరాబాద్) ఉండగా, 22 క్యారెట్ల (ఆభరణాల) బంగారం ధర రూ. 24,295 (ముంబై), రూ. 24,562 (చెన్నై), రూ. 24,620 (హైదరాబాద్) వద్ద కొనసాగుతోంది. వెండి కిలోకు రూ. 800 వరకు తగ్గింది. బంగారం ధర తగ్గటంతో కొనుగోలు డిమాండ్ పెరిగి విక్రయాలు లాభదాయకంగా ఉంటాయని జ్యుయెలరీ వ్యాపారస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తెలుగు సంవత్సరం ప్రారంభంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదన్న ఉద్దేశంతో పలువురు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News