: గచ్చిబౌలిలో తెలంగాణ హైకోర్టు... కేంద్రానికి ప్రతిపాదించిన టీఆర్ఎస్ ఎంపీలు


రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టును కూడా విభజించాల్సిందేనని తెలంగాణ న్యాయవాదులు కొద్దిరోజులుగా ఆందోళనలు కొనసాగించారు. వారి ఆందోళనల నేపథ్యంలో తక్షణమే హైకోర్టును విభజించి తమకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అసెంబ్లీ తీర్మానం చేసిన మరుక్షణమే రంగంలోకి దిగిన టీఆర్ఎస్ ఎంపీలు కవిత, వినోద్ కుమార్ లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను ఢిల్లీలో కలిశారు. గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన భవన సముదాయంలో తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు గౌడను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను సంప్రదించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని వారికి బదులిచ్చారు.

  • Loading...

More Telugu News