: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్... మరికాసేపట్లో అడిలైడ్ లో మ్యాచ్ ప్రారంభం
వరల్డ్ కప్ మెగా టోర్నీలో మరికాసేపట్లో మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా నగరం అడిలైడ్ లోని ఓవల్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆసీస్ కు బౌలింగ్ అప్పగించింది. భారత్ పై సెమీ ఫైనల్ లో తలపడే జట్టును నిర్ధారించనున్న ఈ మ్యాచ్ లో ఇరు జట్లు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. స్వదేశంలోని బౌన్సీ పిచ్ లపై పదునైన బంతులతో చెలరేగే ఆసీస్ బౌలర్లను పాక్ బ్యాట్స్ మెన్ ఏ విధంగా ఎదుర్కొంటారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి తన చిరకాల ప్రత్యర్థి భారత్ ను సెమీస్ లో మట్టికరించాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది.