: అంగారకుడిపై ఏర్పడ్డ ధృవకాంతులు ఏమై ఉంటాయి చెప్మా!
అంగారకుడిపై నాసా జరుపుతున్న పరిశోధనలు లోతుగా సాగుతున్నాయి. అంగారకుడిపైకి చేరిన నాసాకు చెందిన 'మావెన్' ఉపగ్రహం కొత్త విషయాలు కనుగొంటూనే ఉంది. గత క్రిస్మస్ కు ముందు అంగారకుడిపై ఐదు రోజులపాటు ప్రకాశవంతమైన ధృవకాంతులు ఏర్పడ్డట్టు 'మావెన్' గుర్తించింది. వీటిని తన కెమెరాలో బంధించి నాసాకు పంపింది. అలాగే మార్స్ వాతావరణంలో భారీ ధూళి మేఘాలను కూడా గుర్తించిందట. భూమిపైలా కాకుండా అరుణగ్రహంపై ధృవకాంతులు లోతుగా ఏర్పడడం, ధూళి మేఘాలు ఏకంగా 300 కిలోమీటర్ల ఎత్తుకు వ్యాపించడం వంటివి శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. దీనికి రకరకాల కారణాలు చెబుతున్నా అవన్నీ ఊహాగానాలని, వాస్తవాలు కనుక్కోవాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.