: తొమ్మిది మంది భారతీయ అమెరికన్లకు ఫెలో షిప్
వర్ధమాన శాస్త్రవేత్తలకు ఆల్ఫ్రెడ్ పి స్లోన్ ఫౌండేషన్ అందించే ఫెలోషిప్ లను తొమ్మిది మంది భారతీయ అమెరికన్లు అందుకోనున్నారు. 2015వ సంవత్సరానికి ఆ ఫౌండేషన్ అమెరికా, కెనడాకు చెందిన అత్యంత ప్రతిభ కనబరిచిన 126 మంది వర్ధమాన పరిశోధకులకు ఫెలోషిప్ ప్రకటించింది. వారిలో తొమ్మిది మందికి భారతీయ మూలాలు ఉండడం విశేషం. ఈ ఫెలోషిప్ కింద ఒక్కొక్కరికీ 50 వేల డాలర్లు (సుమారు 31.3 లక్షల రూపాయలు) అందజేయనున్నారు. ఈ ఫౌండేషన్ 1955 నుంచి వర్ధమాన శాస్త్రవేత్తలకు ఫెలోషిప్ లను అందజేస్తోంది.