: భారతీయ శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు


దేశంలో సంపన్నుల సంఖ్య భారీగా పెరుగుతోందని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. గత పదేళ్లలో భారత్ లో అతి భారీ సంపన్నులు 166 శాతం వృద్ధిరేటుతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 50 శాతం పెట్టుబడులను విదేశాల్లోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ లో పెట్టారని తెలిపింది. 33.1 శాతం మంది ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారని కన్సల్టెన్సీ వెల్లడించింది. 20.4 శాతం మంది డెట్స్ లో పెట్టుబడులు పెడుతున్నారని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1,72,850 మంది శ్రీమంతులు ఉండగా, వారిలో 1,652 మంది భారతీయులు ఉండగా, వారిలో 39 మంది హైదరాబాదీలు ఉన్నారని నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2024 నాటికి భారతీయ శ్రీమంతుల సంఖ్య 3,371కి పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News