: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే!: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఏపీ మంత్రులతో కేంద్ర హోం మంత్రిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సాధారణంగా ప్రత్యేక పరిస్థితులు (కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు) ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా వర్తిస్తుందని, అయితే ఏపీ ప్రజల అభీష్టం తెలుసుకోకుండా ఏకపక్ష విభజన జరిగినందుకు ప్రతిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. విభజన కారణంగా ఆంధ్రులు హైదరాబాదు ఆదాయం కొల్పోయారని, లోటు బడ్జెట్ లోకి వెళ్లిపోయారని ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై అన్ని విభాగాలు అధ్యయనం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాను బిల్లులో చేర్చాలని, ప్రణాళికా సంఘం అనుమతి తీసుకోవాలని ఆనాడే చెబితే పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ పార్టీ, అమలు చేయడం లేదంటూ ఇప్పుడు ఆందోళన చేయడం విస్తుగొలిపే అంశమని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న పలు అంశాల్లో గందరగోళం చోటుచేసుకోవడం కారణంగా వాటిపై మరింత అధ్యయనం చేసి త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News