: నేడు లోక్ సభ ముందుకు నల్లధనం నియంత్రణ బిల్లు


నల్లధనం సమస్య నియంత్రణపై బిల్లును కేంద్రప్రభుత్వం నేడు లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లులో విదేశాల్లో అక్రమంగా ఆస్తులను దాచిపెట్టిన వారిని విచారించడం, వారికి గరిష్ఠంగా పదేళ్ల కఠిన కారాగారశిక్ష విధించడం, బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తులపై కొత్త పన్నులు విధించడం వంటివన్నీ ఈ బిల్లులో ఉండనున్నాయని సమాచారం. బిల్లు ప్రవేశపెట్టిన తరువాత, దానిని ఆమోదించడానికి ముందు పార్లమెంటరీ సంఘానికి సిఫారసు చేసే అవకాశం ఉంది. విదేశాల్లో దాచిపెట్టిన ఆస్తుల వివరాలను వెల్లడించి, పన్నులు, జరిమానాలు చెల్లించడం ద్వారా శిక్ష తప్పించుకునేందుకు కొంత సమయం ఇచ్చేందుకు ఈ బిల్లు అవకాశం కల్పించనుంది. ఈ బిల్లు ప్రకారం ఆదాయ, ఆస్తుల వివరాలను గోప్యంగా ఉంచడం, విదేశీ ఆస్తులకు సంబంధించి పన్ను ఎగవేత వంటి నేరాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించనున్నారు.

  • Loading...

More Telugu News