: మీడియా ముందు జగన్ బడ్జెట్ పై ప్రసంగం... స్పీకర్ తీరుకు నిరసనగా వినూత్న ఆందోళన
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న సభ నుంచి వాకౌట్ చేశారు. పార్టీ సభ్యులతో కలిసి ఆయన విసుగ్గా సభ నుంచి నిష్క్రమించారు. అయితే నేడు ఆయన సభా సమావేశాలకు హాజరయ్యేందుకు ససేమిరా అంటున్నారు. తాను సభలో చేయాలనుకున్న బడ్జెట్ ప్రసంగాన్ని మీడియా ముందు వినిపించనున్నారు. స్పీకర్ తమకు సమయం ఇవ్వకుండా అడ్డుకుంటున్న తీరుకు నిరసనగానే జగన్ ఈ మేరకు వినూత్న ఆందోళనకు తెర తీయనున్నారు.