: సీబీఐలో జరుగుతున్న అవినీతి సంగతి ఏంటి? :ప్రశాంత్ భూషణ్


సీబీఐలో ఉన్నతస్థాయిలో జరిగే అవినీతిపై దర్యాప్తు సంగతి ఏంటని ఆప్ అసమ్మతి నేత, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సీబీఐని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీబీఐలో రాజకీయ, పరిపాలనా జోక్యం పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ ఆర్ కే సిన్హా సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఓ కేసులో నిందితుడితో భేటీ అయ్యారని ఆయన చెప్పారు. దీనిపై సీవీసీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. అయితే సీబీఐ మాజీ డైరెక్టర్ పై ఎవరు దర్యాప్తు చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎవరికీ తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన సుప్రీంకోర్టు వద్ద పెండింగ్ లో ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News