: బౌద్ధ క్షేత్రాలను రక్షించే బాధ్యత మాదే: కిరణ్ రిజిజు


భారతదేశంలోని బౌద్ధ క్షేత్రాలను సంరక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఢిల్లీలో బౌద్ధ సన్యాసుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భారతదేశం బౌద్ధ మతానికి పుట్టినిల్లని అన్నారు. అందుకే బౌద్ధ క్షేత్రాలను సంరక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ సమావేశంలో శ్రీలంకకు చెందిన అగ్రశ్రేణి బౌద్ధ సన్యాసులు, భారత్, టిబెట్ దేశాలకు చెందిన మహాయాన బౌద్ధ సన్యాసులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News