: హైదరాబాదులో వెలుగు చూస్తున్న కొత్తరకం మోసాలు


హైదరాబాదులో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయని డీసీపీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసేందుకు సైబర్ క్రైం ముఠాలు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నాయని అన్నారు. సైబర్ క్రైం ముఠాల ఎత్తుగడలను పోలీసులు భగ్నం చేస్తుండడంతో కొత్త ఎత్తులతో మోసాలకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆయన వెల్లడించారు. మీ ఇన్సూరెన్స్ కాల పరిమితి ముగిసిందని చెబుతూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని, మీ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ వివరాలు చెప్పాలంటూ అడుగుతున్నారని ఆయన చెప్పారు. ఒకవేళ, అలాంటి కాల్స్ లిఫ్ట్ చేస్తే డెబిట్, క్రెడిట్ కార్డ్స్ వివరాలు చెప్పవద్దని, ఇలాంటి కాల్స్ అన్నీ సైబర్ నేరగాళ్లవేనని ఆయన స్పష్టం చేశారు. వెస్ట్ జోన్ పరిధిలో పలువురిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లతో పాటు, ఇద్దరు రౌడీ షీటర్లపై పీడీయాక్టు నమోదు చేసినట్టు వివరించారు. అమ్మాయిలను సరఫరా చేస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News