: అవగాహన లేనివాళ్లు చట్టసభలకు వస్తే ఇలాగే ఉంటుంది: జగన్ కు జేసీ చురక
ఏపీ అసెంబ్లీలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, వైసీపీ సభ్యుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై మాట్లాడుతూ... ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని అన్నారు. పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి, పరిస్థితులపై అవగాహన లేనివాళ్లు చట్ట సభలకు వస్తే ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు తెలిసుండాలని, అనుభవం కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. అవి లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయని, గతంలో బీహార్, యూపీ రాష్ట్రాల చట్ట సభల్లో జరిగిన ఘటనలను గుర్తుచేశారు.