: చవక బైక్ ఇదిగో... 89.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటున్న బజాజ్!


మధ్యతరగతి ప్రజల ప్రయాణ కష్టాలు తీర్చేందుకు బజాజ్ ఆటోమొబైల్స్ సంస్థ నడుం బిగించింది. చవక బైక్ తో మరోసారి మార్కెట్లో హల్ చల్ చేసేందుకు సిద్ధమైంది. తొమ్మిదేళ్ల క్రితం ఉత్పత్తి ఆపేసిన సీటీ 100 బైక్ ను మరోసారి కొత్తగా విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. స్పోక్స్ ఉన్న బైక్ అయితే 35,034 రూపాయలని, అల్లాయ్ వీల్స్ బైక్ అయితే 38,304 రూపాయలకు లభ్యమవుతుందని సంస్థ తెలిపింది. నాలుగు గేర్ల సీటీ 100 మోటార్ సైకిల్ కు 99.3 సీసీ సింగిల్ సిలెండర్ ఇంజన్ ఉంటుందని సంస్ధ వెల్లడించింది. లీటర్ పెట్రోలుకు 89.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ముందువైపు హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుకవైపు బజాజ్ ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్ అమర్చినట్టు సంస్ధ తెలిపింది. ఇదే తరహా ప్లాటినా, డిస్కవర్ బైకులను బజాజ్ సంస్థ మార్కెట్లో విడుదల చేసినప్పటికీ వాటి కంటే ఇది చవకైన బైక్.

  • Loading...

More Telugu News