: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా ఎడిషన్ సమీపిస్తోంది. ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు పోటీలు జరుగుతాయి. కాగా, లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆసీస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు సన్ రైజర్స్ యాజమాన్యం ట్విట్టర్లో పేర్కొంది. దీనిపై, వార్నర్ స్పందిస్తూ, భవిష్యత్తులో ఆసీస్ జట్టుకు కెప్టెన్సీ వహించేందుకు ఈ అవకాశం ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. తన సారథ్య నైపుణ్యం ప్రదర్శించేందుకు దీన్ని ఓ వేదికగా ఉపయోగించుకుంటానని అన్నాడు. కాగా, ఐపీఎల్ గత సీజన్ లో సన్ రైజర్స్ జట్టు ఆరోస్థానంలో నిలిచింది. ఆ ఎడిషన్ లో వార్నర్ 14 ఇన్నింగ్స్ లలో 528 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News