: తెగుతున్న'కాశ్మీర' బంధం?... సంకీర్ణం నుంచి వైదొలగడానికి సిద్ధమన్న అమిత్ షా


జాతి ప్రయోజనాలు కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌ లో ముఫ్తీ సర్కారు వేర్పాటువాద సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ముఫ్తీ కొలువుదీరిన తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఫ్తీ వ్యాఖ్యలతో సంకీర్ణ పక్షాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా వేర్పాటువాద నేత ఆలం విడుదల విషయంలో పార్లమెంట్ లో ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు ప్రకటనలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, కాశ్మీరంలో బీజేపీ, పీడీపీల బంధం ఎంతకాలం నిలుస్తుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News