: కేటీఆర్ ను ఆహ్వానించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం


తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియాలో మే 5 నుంచి 7 వరకు పీబీటీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటీఆర్ కు ఆహ్వానం పంపింది. దీనిపై, కేటీఆర్ స్పందన తెలియరాలేదు. కాగా, పలు దేశాల నుంచి తెలంగాణ సర్కారు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ట్రేడ్ ఫెయిర్ ను కూడా తెలంగాణ సర్కారు పెట్టుబడుల కోణంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News