: తెలంగాణలో మార్చ్ 25 నుంచి పదో తరగతి పరీక్షలు
ఈ నెల 25 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చిరంజీవి పరీక్షల షెడ్యూల్ ను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు 15 నిమిషాల గడువు పెంచామని అన్నారు. మొత్తం మీద 5,15,590 మంది రెగ్యులర్ విద్యార్థులు, 49,410 మంది ప్రైవేట్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,614 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.