: షిండే ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు
ఢిల్లీలో ఐదేళ్ళ చిన్నారిపై అత్యంత దారుణమైన రీతిలో అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నేడు దేశ రాజధానిలో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు ఈ మధ్యాహ్నం హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంటిని ముట్టడించారు. అంతేగాకుండా.. ఎయిమ్స్, రాష్ట్రపతి భవన్, పోలీస్ కమిషనరేట్ ప్రాంతాల్లో భారీగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి షిండే స్పందించారు. విచారణ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారిపై వికృత చేష్టలకు పాల్పడిన నిందితుడిని నేడు బీహార్లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.