: ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో గర్భవతులు... వసతి లేక 73 మందిని కింద పడుకోబెట్టిన నిర్మల్ వైద్యులు
ఆ ఆసుపత్రికి నెలలు నిండిన గర్భిణీలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కాన్పు కోసం పదుల సంఖ్యలో మహిళలు రావడంతో, ఆసుపత్రి వైద్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. అంతమందికి ఒకేసారి వసతులు కల్పించే వీల్లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఏరియా వైద్యులు చేతులెత్తేశారు. కొందరికే బెడ్లు ఇవ్వగలిగారు. 73 మంది గర్భవతులు బెడ్ వసతి లేక బాధ పడుతున్నారు. మరోవైపు, మిగతా రోగులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఉదంతంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.