: తనపై చేయివేసిన తాగుబోతును చితకబాది పోలీసులకు అప్పగించింది!


ముంబైలోని విలేపార్లేలోని ఓ కళాశాలలో బోరివిలేకి చెందిన మంధరే మాస్ మీడియాలో డిగ్రీ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి వస్తూ, లోకల్ ట్రైన్ కోసం ఎదురుచూస్తూ రైల్వే స్టేషన్ లో నిలుచుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఓ తాగుబోతు వచ్చి, ఆమె మీద చేయివేశాడు. దీంతో భయపడ్డ మంధరే కాస్త పక్కకు జరిగింది. అయినా అతను వెనుదిరగకపోవడంతో ధైర్యం చేసి తన దగ్గరున్న బ్యాగ్ తో నాలుగు దెబ్బలేసింది. దీంతో, ఆ తాగుబోతు ఎదురుదాడికి దిగాడు. అయితే, అతడి జట్టు దొరకబుచ్చుకున్న మంధరే మరో నాలుగు తగిలించి, రైల్వే పోలీసులకు అప్పగించింది. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా రైల్వేస్టేషన్ లో ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News