: షకిబ్ కూడా చిత్తగించాడు... కష్టాల్లో బంగ్లాదేశ్
స్టార్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ కూడా వెనుదిరగడంతో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. కేవలం 10 పరుగులు చేసిన షకిబ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో షమీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 303 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ప్రస్తుతం బంగ్లా జట్టు 29 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 198 పరుగులు అవసరం. 21 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. క్రీజులో రహీం (7 బ్యాటింగ్), రెహ్మాన్ (1 బ్యాటింగ్) ఉన్నారు.