: మరో వికెట్ తీసిన షమి... 27 ఓవర్లలో బంగ్లాదేశ్ 102/4
బంగ్లాదేశ్ జట్టు మరో వికెట్ చేజార్చుకుంది. నిప్పులు చెరుగుతున్న పేసర్ మహ్మద్ షమి బంగ్లా యువ బ్యాట్స్ మన్ సౌమ్యా సర్కార్ (29) ను పెవిలియన్ చేర్చాడు. కాగా, 27 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. గెలవాలంటే ఇంకా 23 ఓవర్లలో 201 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజులో రహీం (6 బ్యాటింగ్), షకిబ్ (10 బ్యాటింగ్) ఉన్నారు.