: ధావన్ సూపర్ క్యాచ్... మహ్మదుల్లా అవుట్


భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మహ్మదుల్లా టీమిండియా పేసర్ షమి బౌలింగ్ లో వెనుదిరిగాడు. షమి విసిరిన షార్ట్ బాల్ ను భారీ షాట్ కొట్టబోయి బౌండరీ వద్ద ధావన్ కు క్యాచ్ ఇచ్చాడు. కాగా, మహ్మదుల్లా కొట్టిన బంతి గాల్లో పైకెగసింది. సరిగ్గా లాంగ్ లెగ్ లో బౌండరీ వద్ద ఉన్న ధావన్ దాన్నందుకునే ప్రయత్నంలో లైనును తాకినట్టు కనిపించాడు. అయితే, తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న ధావన్ బౌండరీ లైను ఆవలకెళ్లే క్రమంలో బంతిని గాల్లోకి విసిరి, తిరిగి మైదానంలోకి వచ్చి నింపాదిగా క్యాచ్ అందుకున్నాడు. అప్పటికి బంగ్లాదేశ్ స్కోరు 17 ఓవర్లలో 3 వికెట్లకు 73 పరుగులు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 33 ఓవర్లలో 230 పరుగులు చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News