: కొండచరియలు విరిగి పర్యాటకుల మృతి


అందమైన ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు వెళ్లిన వారిని మృత్యువు వెంటాడింది. కొండచరియలు విరిగి పడి ఏడుగురు పర్యాటకులు మృతి చెందిన ఘటన చైనాలోని గ్విలిన్ ప్రాంతంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన డీకయీ పర్వతాల సమీపంలో చోటు చేసుకుంది. ఓ బోటులోకి ఎక్కేందుకు వేచి ఉన్న పర్యాటకులపై పెద్ద పెద్ద బండ రాళ్ళు పడ్డాయి. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చైనా సెంట్రల్ టెలివిజన్ వెల్లడించింది. కాగా, డీకయీ పర్వత ప్రాంతం అందమైన గుహలకు ప్రసిద్ధి. నిత్యం ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

  • Loading...

More Telugu News