: అతిగా మద్యం తాగి అవస్థలు పడుతున్న ఆస్కార్ అవార్డు నటి
తన అద్భుత నటనా ప్రతిభతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న హాలీవుడ్ నటి లిజా మిన్నెల్లీ (69) ప్రస్తుతం పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. అతిగా మద్యం సేవించే అలవాటున్న ఆమెకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, ఆమె కోలుకుంటున్నారని మిన్నెల్లీ ప్రతినిధి స్కాట్ గోరెన్ స్టెయిన్ తెలిపారు. ఆమె ఎక్కడ చికిత్స పొందుతున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, 1973లో 'క్యాబరేట్' చిత్రంలో నటనకు గాను ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చింది. తాను మద్యానికి బానిసనని బహిరంగంగా చెప్పిన నటీమణుల్లో లిజా మిన్నెల్లీ ఒకరు.