: స్వప్రయోజనాల కోసం పుట్టిన తేదీని మార్చిన ఐపీఎస్ అధికారి!


పదవీ విరమణ తేదీని మరికాస్త పొడిగించుకునేందుకు తమిళనాడులో న్యాయమూర్తులు పుట్టిన తేదీని మార్చి చూపినట్టు నిర్ధారణ కాగా, తాజాగా ఐపీఎస్ అధికారి ఒకరిపై ఇదే విధమైన ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు జిల్లా న్యాయమూర్తులు హై కోర్టు జడ్జీలుగా ప్రమోషన్ తీసుకునేందుకు డేట్ అఫ్ బర్త్ మార్చి చూపగా, 1956లో పుట్టిన ఐపీఎస్ అధికారి ఎస్ రాజేంద్రన్ (తమిళనాడు ట్రాఫిక్ ప్లానింగ్ సెల్ డీజీపీ) తాను జనవరి 15, 1959లో పుట్టినట్టుగా ఒక సర్టిఫికెట్ పుట్టించారు. ఒక తహసీల్దారు నుంచి 'రెక్టిఫైడ్' సర్టిఫికెట్ తీసుకొని దాన్ని ఎస్ఎస్ఎల్సీ (స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్)లో పొందుపరిచేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News