: విమాన టిక్కెట్ల యుద్ధం!... రూ. 2699కే విదేశీ ప్రయాణం... స్పైస్ జెట్ బంపర్ ఆఫర్


ఇండియాలోని విమానయాన సంస్థల మధ్య 'వార్ ఫేర్' మరింతగా పెరిగింది. నిన్న మొన్నటి వరకూ దేశవాళీ రూట్లలో కొనసాగిన తగ్గింపు ధరలు తాజాగా అంతర్జాతీయ రూట్లకు విస్తరించాయి. స్పైస్ జెట్ కేవలం రూ. 2699కే అంతర్జాతీయ రూట్లలో విమాన టిక్కెట్లు విక్రయించనున్నట్టు నేడు ప్రకటించింది. ఈ టిక్కెట్లను మార్చ్ 19 నుంచి 22 మధ్య బుక్ చేసుకోవాలని, ప్రయాణ తేదీ మార్చ్ 19 నుంచి జూన్ 30 వరకూ ఎంచుకోవచ్చని తెలిపింది. అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. గత నెలలో రైల్వే చార్జీలకన్నా తక్కువగా రూ. 599లకు దేశవాళీ విమాన టికెట్లను స్పైస్ జెట్ విక్రయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News