: 90 పరుగుల వద్ద రోహిత్ కు లైఫ్


బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. 3 వికెట్లు కోల్పోయినప్పటికీ రైనా, రోహిత్ శర్మలు బ్యాట్ ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో సెంచరీ దిశగా దూసుకుపోతున్న రోహిత్ కు 90 పరుగుల వద్ద లైఫ్ లభించింది. రూబెల్ బౌలింగ్ లో మిడ్ వికెట్ మీద్ రోహిత్ కొట్టిన షాట్ కు బాల్ గాల్లోకి లేచింది. ఈ క్యాచ్ ను ఫీల్డర్ అందుకున్నాడు. అయితే, నడుము కన్నా ఎత్తులో బాల్ వేశాడన్న కారణంతో బాల్ ను నోబాల్ గా అంపైర్ ప్రకటించాడు. దీంతో రోహిత్ కు లైఫ్ లభించింది.

  • Loading...

More Telugu News