: అసెంబ్లీ గేటు వద్ద కిందపడ్డ చెవిరెడ్డి... గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నిరసన
సభ నుంచి సస్పెన్షన్, మీడియా పాయింట్ నుంచి గెంటివేత, బలవంతంగా అసెంబ్లీ బయటకు తరలింపు నేపథ్యంలో వైసీపీ సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కిందపడ్డారు. మార్షల్స్ బలవంతంగా ఎత్తుకెళుతున్న క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద చెవిరెడ్డి కిందపడ్డారు. ఈ క్రమంలో ఆయాసం పెరిగిపోయిన ఆయన దాదాపుగా స్పృహ కోల్పోయినట్లు సమాచారం. వెనువెంటనే స్పందించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకుని చెవిరెడ్డికి బాసటగా నిలిచారు. ఆయనను తీసుకుని అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. తమపట్ల మార్షల్స్ అత్యంత అమానుషంగా వ్యవహరించారని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.