: స్పీకర్ ను ఫ్యాక్షనిస్టు అన్న వైసీపీ... ఏడాది పాటు సస్పెండ్ చేయాలన్న గోరంట్ల


ఏపీ అసెంబ్లీలో నిన్నటి తరహాలోనే నేడు కూడా గందరగోళం నెలకొంది. సభా కార్యక్రమాలను అడ్డుకున్న ఎనిమిది మంది వైసీపీ సభ్యుల సస్పెన్షన్ కోసం అధికార పార్టీ ప్రతిపాదించిన తీర్మానానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ పై విరుచుకుపడ్డ వైసీపీ సభ్యులు ఆయనను ఫ్యాక్షనిస్టుగా అభివర్ణించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సభ్యులను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై అధికార పక్షానికి చెందిన మిగతా సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News