: 8 మంది వైకాపా సభ్యుల సస్పెన్షన్... సభ నుంచి తక్షణం బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశం


ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. అధికార పక్షంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు స్పీకర్ ను జోకర్ అనడం, స్పీకర్ డౌన్ డౌన్ అనడం లాంటి చర్యలకు వైకాపా సభ్యులు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో, 8 మంది వైకాపా సభ్యులపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో కొడాలి నాని, శివప్రసాద్ రెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, చాంద్ పాషా, శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముత్యాలనాయుడు, జగ్గిరెడ్డిలు ఉన్నారు. వీరిని మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన వారు వెంటనే సభను వీడి వెళ్లిపోవాలని కోడెల ఆదేశించారు. అయితే, తమ సభ్యుల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ రోజా తదితరులు నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News