: అమెరికన్ల పొట్టకొడుతున్న విదేశీ ఉద్యోగులు!


ఇబ్బడి ముబ్బడిగా హెచ్-1బీ వీసాలను జారీచేయడం ద్వారా, దేశంలోకి వెల్లువెత్తుతున్న విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికాలో నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ప్రజావేగు (విజిల్‌ బ్లోయర్) జేపామర్ ఆరోపించారు. అమెరికా సెనేట్ న్యాయకమిటీ సభ్యుల ఎదుట ఆయన ప్రసంగించారు. అమెరికన్లకు నైపుణ్యం లేదని వాదిస్తూ, హెచ్-1బీ వీసా ఉన్న విదేశీయులకు అవకాశాలు ఇస్తున్నామని కంపెనీలు చేస్తున్న వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. అమెరికాకు పిలిపించిన తరువాతనే, కంపెనీలు వారికి ఉద్యోగానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాయని ఆయన వాదించారు. భారత్ కు చెందిన ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు బీ1, హెచ్ 1బీ వీసా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. వీరి చర్యలతో అమెరికాకు రావలసిన ఆదాయపు పన్ను తగ్గుతోందని అన్నారు. పలు కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి పొట్టకొడుతూ, విదేశీయుల్ని విధుల్లోకి తీసుకుంటున్నాయని అన్నారు. ఈ చర్యలను తక్షణం అడ్డుకోకుంటే అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని జేపామర్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News