: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ... పరుగుల వరద ఖాయమే!
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో భాగంగా మరికాసేపట్లో మొదలు కానున్న రెండో మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ లో నేటి ఉదయం 9 గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, బంగ్లాతో తలపడుతోంది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుండటంతో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద ఖాయమేనని విశ్లేషకులు చెబుతున్నారు.