: సత్తా చాటుతున్న తెలుగు యువతులు... యువ అంతర్జాతీయ లీడర్ గా కడప అమ్మాయి!


తెలుగు యువతులు సత్తా చాటుతున్నారు. వివిధ రంగాల్లో అసమాన ప్రతిభ కనబరుస్తూ దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ తెలుగు నేల కీర్తిని చాటుతున్నారు. మొన్నటికి మొన్న సౌత్ ఇండియా క్వీన్ గా తెలంగాణ అమ్మాయి ఐశ్వర్య బాస్ పూనే కిరీటాన్ని దక్కించుకోగా, తాజాగా ఏపీలోని కడప జిల్లాకు చెందిన యువతి పుచ్చలపల్లి షాలిని యువ అంతర్జాతీయ లీడర్ గా ఎంపికయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఈ ఏడాదికి సంబంధించి యువ అంతర్జాతీయ లీడర్ గా షాలినిని ఎంపిక చేసింది. కడపలోని ఆర్తీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా అక్కడి ప్రజలకు చిరపరిచితురాలైన ఆమె, తాజా ఘనతతో ప్రపంచ లీడర్ గా గుర్తింపు సాధించారు. ఈ జాబితాలో భారత్ నుంచి ఎంపికైన వారిలో షాలినితో పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, జీఎంఆర్ గ్రూపునకు చెందిన కిరణ్ కుమార్ గ్రంథి, ఇండియా టుడే సహ సంపాదకుడు శ్వేత పుంజ్ తదితరులున్నారు.

  • Loading...

More Telugu News