: సులువైన గెలుపా?.. ఉత్కంఠ పోరా?... నేడే బంగ్లాతో టీమిండియా క్వార్టర్ ఫైనల్స్!


మరికాసేపట్లో వరల్డ్ కప్ మెగా టోర్నీలో భారత్ తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. బ్యాటింగ్ లోనే కాక బౌలింగ్ లోనూ రాటుదేలిన ధోనీ సేన పసికూనగా భావిస్తున్న బంగ్లాదేశ్ తో నేటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. లీగ్ దశలో ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ ల్లోనూ విజయ కేతనం ఎగురవేసిన టీమిండియా, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోనూ సులువుగానే గట్టెక్కుతుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే బంగ్లాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను సీరియస్ గానే తీసుకుంటున్నామని కెప్టెన్ కూల్ ధోనీ పేర్కొన్నాడు. చిన్న జట్టైనా, జాగ్రత్తగానే ఆడతామని అతడు నిన్న వెల్లడించాడు. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 9 గంటలకు ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ లోని ఎంసీజీ గ్రౌండ్ లో జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా తన విన్నింగ్ జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఇక బంగ్లా కూడా చివరి బంతి దాకా పోరు సాగించాల్సిందేనని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించే జట్టు నేరుగా సెమీ ఫైనల్స్ చేరనుండగా, ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది.

  • Loading...

More Telugu News