: ఒంటె పాలతో ఐస్ క్రీం...ప్రపంచంలో తొలిసారి


ప్రపంచంలో తొలిసారి యూఏఈకి చెందిన పాల ఉత్పత్తుల సంస్ధ 'అల్ ఐన్ డైరీ' ఒంటెపాలతో ఐస్ క్రీం, ఇతర పాల ఉత్పత్తులను తయారు చేసింది. అల్ ఐన్ డైరీ అధికారికంగా ఒంటె పాల ఉత్పత్తులను 'కామలైట్' బ్రాండ్ పేరిట రిటైల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఒంటెపాలతో ఉత్పత్తులను విడుదల చేయడం తాము సాధించిన గొప్ప విజయమని అల్ ఐన్ డైరీ సీఈవో అబ్దుల్లా సైఫ్ అల్ దార్మకీ తెలిపారు. ఐస్ క్రీం తయారీలో ఒంటెపాల పాస్టరైజేషన్ విధానం క్లిష్లమైనదని, ఆ సవాలును అధిగమించామని ఆయన చెప్పారు. ఈ ఒంటెపాల ఐస్ క్రీంలో ఖర్జూర, కుంకుమపువ్వు, ఇలాచీ, చాక్లెట్, కార్మేల్, వెనీలా ఇలా ఆరు ఫ్లేవర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News