: అన్నా హజారేకు సోనియా గాంధీ లేఖ
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ లేఖ రాశారు. ఎన్డీయే ప్రవేశపెట్టిన భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నా హజారే చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నామని లేఖలో సోనియా పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు కాలరాసేలా ఉన్న భూసేకరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆమె లేఖలో స్పష్టం చేశారు. కాగా, భూసేకరణ బిల్లుపై 14 పార్టీల నేతలతో కలిసి పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిర్వహించిన ర్యాలీపై హజారే రాసిన లేఖకు సమాధానంగా ఆమె లేఖ రాశారు. భూసేకరణ బిల్లు రైతులకు ఆమోదయోగ్యంగా లేదని లేఖలో పేర్కొన్నారు.