: ప్రత్యర్థి ఎవరన్నది చూడం... మాకు మ్యాచ్ ముఖ్యం: రవిశాస్త్రి
టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బంగ్లాదేశ్ తో క్వార్టర్ ఫైనల్ సమరంపై తన అభిప్రాయాలు తెలిపారు. తాము ప్రతి మ్యాచ్ ను నాకౌట్ మ్యాచ్ గానే భావిస్తామని, బంగ్లాదేశ్ తో క్వార్టర్స్ పోరును కూడా అలానే పరిగణిస్తామని అన్నారు. ప్రత్యర్థి ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, మ్యాచే తమకు ప్రధానమని స్పష్టం చేశారు. ఈ దృక్పథం ఎన్నోసార్లు సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. బంగ్లాదేశ్ జట్టుతో కూడా ఇతర జట్లతో ఆడిన విధంగానే తలపడతామని వివరించారు. వరుసగా 6 మ్యాచ్ లు గెలిచామని, ఇప్పుడు ఏడో మ్యాచ్ గెలిచేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. తమ తక్షణ లక్ష్యం అదేనన్నారు. బంగ్లాదేశ్ బలాబలాలు ఏమిటన్నవి తనకు అప్రాధాన్య అంశమని, టీమిండియా బలాబలాలు తనకు తెలుసని, వాటిపైనే దృష్టి పెడతానని అన్నాడు.