: బంగ్లాదేశ్ ను ఓడించడం సులువు కాదు: గవాస్కర్


బంగ్లాదేశ్ జట్టును ఓడించడం అంత సులువు కాదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొంటున్నారు. మెల్ బోర్న్ లో ఆయన మాట్లాడుతూ, బంగ్లాదేశ్ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని అన్నారు. మహ్మదుల్లా బంగ్లా జట్టుకు వెన్నెముక అయితే, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ మేజిక్ చేయగలరని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ 250 పరుగులు చేయగలిగితే, ఆ లక్ష్యం ఛేదించడం భారత్ కు సులభం కాదని ఆయన పేర్కొన్నారు. జింబాబ్వేతో మ్యాచ్ లో టీమిండియాకు సవాలు ఎదురైందని, అలాంటి ప్రమాదమే మరోసారి పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. టీమిండియా గెలవాలని కోరుకుంటున్నానని, అయితే అది అందరూ అనుకున్నంత సులభం కాదని ఆయన చెప్పారు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పెద్దది కావడం వల్ల సిక్సులు కొట్టడం అంత సులభం కాదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News