: ఇద్దరు టెర్రరిస్టులు హతం... ట్యునీషియాలో ఉత్కంఠకు తెర


ఆఫ్రికా దేశం ట్యునీషియా ఉగ్రవాదుల కాల్పులతో ఉలిక్కిపడింది. రాజధాని ట్యునిన్ లో బర్దో మ్యూజియంపై దాడి చేసిన ఇద్దరు టెర్రరిస్టులను భద్రత బలగాలు కాల్చి చంపాయి. దీంతో, ఆపరేషన్ ముగిసింది. రెండు గంటలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కాగా, అంతకుముందు ఉగ్రవాదుల దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. వారిలో ఏడుగురు విదేశీయులు, ఓ ట్యునీషియా వ్యక్తి ఉన్నారు. ట్యునీషియా మృతులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సంతాపం తెలిపారు. ట్యునీషియా ప్రెసిడెంట్ బెజీ సెయిద్ కు ఈ మేరకు ఓ సందేశం పంపారు.

  • Loading...

More Telugu News