: ట్యునీషియాలో టెర్రర్ దాడి... ఉగ్రవాదుల చెరలో పర్యాటకులు
ట్యునీషియా రాజధాని ట్యునిన్ లోని బర్దో మ్యూజియంపై టెర్రరిస్టులు దాడి చేశారు. ప్రఖ్యాత పర్యాటక స్థలంగా పేరుగాంచిన ఈ మ్యూజియంలో దాడి జరిగిన సమయంలో 100 మంది ఉన్నారు. సైనికుల వేషంలో అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో, ఎనిమిది మంది చనిపోయారు. వారిలో ఏడుగురు విదేశీ పర్యాటకులు. కాగా, మ్యూజియంలో కొందరిని టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వారిని విడిపించేందుకు ప్రభుత్వ దళాలు సన్నద్ధమయ్యాయి. దాడికి కారణం ఏ ఉగ్రవాద సంస్థ అన్నది తెలియరాలేదు.