: అతలాకుతలమైన వెనౌటుకు భారత్ ఆర్థిక సాయం


పామ్ తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వెనౌటు దీవికి భారత్ ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.1.5 కోట్లను తక్షణ సాయంగా అందిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. కేటగిరీ 5 స్థాయిలో ఈ తుపాను మార్చి 13 నుంచి కొన్ని రోజుల పాటు వెనౌటును అతలాకుతలం చేసిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందని తెలిపింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేలమంది నిరాశ్రయులయ్యారు. 2013 వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం వెనౌటు జనాభా 2,52,763. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చిన్నదీవి అయిన వెనౌటును పామ్ తుపాను కుదిపేసింది. కూలిపోయిన ఇళ్లు, విరిగిన చెట్లతో అక్కడ దారుణ పరిస్థితి నెలకొని ఉంది.

  • Loading...

More Telugu News